"సంపూర్ణ శ్రీమత్ భగవద్గీతా అధ్యయన జ్ఞాన యజ్ఞం"



YAGNIKADARSHINI SEPTEMBER SPECIAL EDITION

అస్తమించిన ఆగమ దిక్సూచి

అస్తమించిన ఆగమ దిక్సూచి

ప్రామాణికమైన ప్రతిష్ఠలలో అందెవేసిన చేయి
మూడు తరాలను మెప్పించిన సంప్రదాయ సారథి
వీరి ఆగమ నిష్ఠకు గీతాభవనమే గీటురాయి
భావి భవితకు భరోసా వారి ఘనకీర్తి
శ్రీవైష్ణవ శ్రీ అక్షర నీరాజనం


శ్రీవైష్ణవ సాంప్రదాయ పరిరక్షణలో ఒక దిక్సూచిగా, వరంగల్‌ గీతాభవన పెరుమాళ్ళను, 
శ్రీ వైకుంఠ విరక్తాయ గీతాభవన వాసినే| పద్మావతీ సమేతాయ శ్రీనివాసాయ మంగళం||
 అని మనసా వాచా కర్మణా త్రికరణముల శుద్ధిగా, ప్రాణప్రదంగా ఆరాధించి తన ప్రాణమున్నంత వరకు ఊర్థ్వపుండ్రధారుడై, నిత్య నైమిత్తిక కర్మలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ, సంవత్సరాలుగా సుందరకాండ పారాయణం చేస్తూ, గీతాభవనానికి వచ్చే ప్రతీ భక్తుడిని భగవత్‌ భాగవత కైంకర్యంలో భాగ స్వాములను చేస్తూ తన కంచుకంఠంతో ఉచ్ఛారణ దోషం లేకుండా ఆశీర్వచన మంత్రాన్ని, శ్రీవేంకటేశ్వర కమలాకుచ చూచుక కుంకుమతో అనే శ్రీవేంకటేశ్వర ప్రపత్తి చెబుతూ ఆ ధ్వనించే శబ్ద తరంగాలతో భక్తులకు సర్వ విధములైన దురితములను దూరంచేసి, మానసిక ప్రశాంతతను ప్రసరింపజేసిన మన  ఉ.వే.ప్ర. శ్రీమాన్‌ ముడుంబై శ్రీమన్నారాయణాచార్య స్వామి శనివారం 30.12.2023 న ఉదయం 10.45 ని.లకు ఆచార్య తిరువడిగళ్ళు చేరినారు.


 

No comments:

Post a Comment