యాజ్ఞికపీఠం విద్యార్థుల విజయ డంకా !!
శ్రాత - స్మార్త విద్వన్మహాసభలో ఆగమ పరీక్షలు
యాజ్ఞికపీఠంలో వైదిక విద్య అభ్యసించి శ్రీ పాంచరాత్ర ఆగమ పరీక్ష పాల్గొన్న విద్యార్థులందరూ ఈసారి నూటికి నూరు శాతం ఉత్తీర్ణులై విజయ ఢంకా మ్రోగించారు.గత నాలుగు రోజులుగా చైతన్యపురి హైదరాబాదులో జరిగిన కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద కాణ్వ, మాధ్యందిన శాఖ, స్మార్త, స్మార్తాగమం, శ్రీ పాంచరాత్రాగమ విభాగాలలో నిర్వహించిన పరీక్షల్లో సుమారు 113 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు మొదలైన ప్రాంతాల నుండి కూడా ఉన్నారు. ముఖ్యంగా యాజ్ఞికపీఠమునకు సంబంధించిన పది మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో తొమ్మిది మంది ప్రవేశభాగం పరీక్ష రాయగా ఒకరు వర విభాగంలో బ్రహ్మోత్సవ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా తిరుపతి విద్యార్థులు 8 మంది పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో ఉన్నారు. ఇలా నూటికి నూరు శాతం విద్యార్థులు యాజ్ఞికపీఠం నుంచి వెళ్లిన వాళ్లందరూ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రశంసలకు పాత్రులైనారు
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు. జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి దివ్యానుగ్రహ ఆదేశ ఆమోద ఆశీర్వచనములతో బ్రహ్మశ్రీ గుంటూరు శ్రీరామచంద్రమూర్తి సోమయాజులు గారిచే స్థాపించబడి నిర్వహించబడుచున్న కృష్ణా విజయదుర్గా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రౌత- స్మార్త విద్వన్మహాసభ 43వ వార్షిక సభా సమావేశములు. గత 5రోజులుగా హైదరాబాద్ చైతన్యపురిలో వైభవంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్ సంవత్సర మార్గశీర్ష శుక్ల త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణిమ 2023వ సంవత్సరము డిసెంబరు 24,25 మరియు 26 తేదీలలో ఆది, సోమ, మరియు మంగళవారములలో శ్రీ కోదండ రామాలయం, శ్రీ కంచి కామకోటి పీఠము చైతన్యపురి, హైదరాబాద్ లో శ్రీ పరమాచార్యుల వారి ఆశీర్వచనము మరియు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్రవ్య సహకారముతో ఆస్తికవరేణ్యుల సహాయ సహకారములతో నిర్వహించారని కార్యనిర్వాహకాధ్యక్షులు బ్రహ్మశ్రీ గుంటూరు వేంకటేశ్వర సోమయాజులు, కార్యదర్శి బ్రహ్మశ్రీ పెద్దిభొట్ల ఉమా మహేశ్వరం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 24 ఉదయం మంగళ వాయిద్యములతో గ్రామ ప్రదక్షణతో సభాస్థలి ప్రవేశము గోపూజ, గణపతి పూజ, కలశస్థాపనతో ఉత్సవ ఆరంభము, మధ్యాహ్నం 2-30 నుండి 5-30 వరకు శ్రౌత స్మార్త విద్యార్థులకు పరీక్షలు, డిసెంబర్ 25 మధ్యాహ్నం 2-30 నుండి 5-30 వరకు వేదవిద్యార్థులకు (ఇతర శాఖలు) మరియు స్మార్త ఆగమార్చక పరీక్షలు నిర్వహించారు.
డిసెంబర్ 2023, 26 మంగళవారము వేద, శ్రౌత, స్మార్త విద్వాంసులచే పాండిత్య ప్రకర్షణలు, శ్రౌత-స్మార్త విషయములందు చర్చలు, సమావేశములు నిర్వహించారు. ముఖ్య పరీక్షాధికారులుగా బ్రహ్మశ్రీ దెందుకూరి వేంకటేశ్వర ఘనపాఠీ పౌండరీకయాజులు గారు బ్రహ్మశ్రీ మద్దులపల్లి సూర్యనారాయణ ఘనపాఠీ గారు బ్రహ్మశ్రీ విరూపాక్ష శ్యావాస్వ మహర్షి గారు బ్రహ్మశ్రీ సామవేదం సుందరరామన్ శ్రౌతి గారు బ్రహ్మశ్రీ కపిలవాయి శ్రీరామశాస్త్రి యజ్వ గారు బ్రహ్మశ్రీ లింగాల సత్యనారాయణ అవధాన్లు గారు పాల్గొన్నారు. యాజ్ఞికపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ పిటిజిఎస్ కిశోరస్వామి వారిని కూడా పరీక్ష అధికారికరిగా వారు ఆహ్వానించారు. పరీక్షా ఫలితాలను వారు మరునాడు ప్రకటించారు. డిసెంబర్ 26, మంగళవారము సాయంత్రం వేద, శ్రౌత, స్మార్త విద్వాంసులచే పాండిత్య ప్రకర్షణలు, శ్రౌత-స్మార్త విషయములందు చర్చలు, సమావేశములు నిర్వహించారు. సాయంత్రం 5-00 ల నుండి విద్యార్థులకు యోగ్యతాపత్రములు, పారితోషికములు, పండితులకు సత్కారములు అందజేసారు.
ఉత్తీర్ణులైన విద్యార్థుల
వివరాలు
రేపటి సంచికలో...
No comments:
Post a Comment